
నేరుగా జీతాలు ఇప్పిస్తాం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మగౌరవంగా బతికే విధంగా ప్రజా పాలన
ప్రొఫెసర్ కోదండరాం
కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఔట్ సోర్స్ మేయిన్ సోర్స్
- మాజీ ఎంపీ మధుయాష్కి
ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది
న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాం
తీన్మార్ మల్లన్న, దాసరి శ్రీనివాస్.
హైదరాబాద్, వెలుగు
ఏజెన్సీ వ్యవస్థ రద్దు కావాల్సిన అవసరం ఉందనీ, ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్తామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ సుప్రీంకోర్టు జీవోలు ఇచ్చినా గత ప్రభుత్వం తుంగలో తొక్కి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుకలు వాళ్లకు నచ్చినట్టుగా జీతాలు ఇచ్చి, నడిరోడ్డు మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన కూడా గత ప్రభుత్వం పాటించలేదన్నారు. న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్న రూ.13వేలు, రూ.15వేల జీతాలతో వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని అన్నారు.తక్కువ జీతంతో గవర్నమెంట్ ప్రకటించే ప్రతి పథకాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఓ సోర్స్ అని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలను ఒప్పించి త్వరలో శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు. దళారీ వ్యవస్థను అతి తొందరలోనే రద్దు చేపిస్తామని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు, వారి కుటుంబాలకు హెల్త్ స్కీమ్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తీన్మార్ మల్లన్న, దాసరి శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు లక్ష్మయ్య, శ్రీధర్, జగదీశ్, నాజీర్, వినోద్, రాజ, మహ్మద్, నారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు.

