బ్యాంకులతో సింగరేణి ఒప్పందం
యూనియన్ బ్యాంక్, ఎస్బీఐలో శాలరీ ఎకౌంట్‌ ఉన్న వాళ్లకు వర్తింపు
హెడ్డీఎఫ్సీలో అకౌంట్ ఉన్నవాళ్లకు రూ. 40 లక్షలు

హైదరాబాద్‌ : సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కార్మికులకు అనుకోకుండా ప్రమాదం జరిగినా, సంఘటనలో మృతిచెందినా వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో సింగరేణి యాజమాన్యం, పలు బ్యాంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు రూ. కోటి ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తుంది. అదేవిధంగా హెడ్‌డీఎఫ్‌సీలో శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లకు రూ. 40లక్షల ఉచిత బీమా సౌకర్యం దక్కుతుంది.

యూనియన్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా బీమా ప్రయోజనాలు:
– ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో).
– యూనియన్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా రూ.15 లక్షల బీమా ప్రయోజనం.
– కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా బీమా సదుపాయం దక్కుతుంది.
– అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్‌ సర్జరీ లాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమైనప్పుడు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.
– ప్రమాదంలో మరణించినప్పుడు ఆ ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సాయం.
– ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.
– ఎయిర్‌ అంబులెన్స్‌ అవసరమైనప్పుడు రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం.
– ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.
– అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్‌ పేషెంట్‌ కవరేజ్‌ సదుపాయం.
– యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. ఎలాంటి అదనపు చార్జ్ వేయరు. ఎస్‌ఎంఎస్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ చార్జీలు కూడా ఉండవు.
– లాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్‌ మీద 50 శాతం రాయితీ కల్పిస్తారు.
– రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.
– గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తారు.
– వాహన రుణాల వడ్డీ పై 0.10 శాతం ప్రత్యేక రాయితీ.
– విదేశీ విద్య కోసం తీసుకునే రూ.75 లక్షలకు పైగా రుణాలపై 0.10 శాతం రాయితీ.
– కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది.
– యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది.
– ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ ఖాతాను యూనియన్‌ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏండ్ల వయసు వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది.

======
ఎస్‌బీఐ బీమా ప్రయోజనాలు:

– ఎస్‌బీఐ బ్యాంకులో సాలరీ ఎకౌంట్‌ ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రూ.కోటి బీమా కల్పిస్తారు.
– ప్రమాదంలో చనిపోతే రూ.కోటీ పరిహారం అందిస్తారు.
– ప్రమాదంలో శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి పరిహారం అందిస్తారు.
– ప్రమాదంలో పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.20 లక్షల పరిహారం అందిస్తారు.
– ప్లాస్టిక్‌ సర్జరీ జరిగితే రూ.2లక్షల ఆర్థిక సాయం.. విదేశాల నుంచి మెడిసిన్స్‌ రవాణాకు రూ.లక్షల సాయం
– కోమాలో ఉండి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము వర్తింపజేస్తారు.
– ఎయిల్‌ అంబులెన్స్‌ కోసం రూ.5లక్షల సాయం.
– ప్రమాదంలో ఉద్యోగి చనిపోతే పిల్లల గ్రాడ్యుయేషన్‌ చదువు కోసం రూ. 4 లక్షల ఆర్థిక సాయం, 18 నుంచి 25 ఏండ్ల ఆడపిల్లల వివాహానికి 2లక్షల ఆర్థిక సాయం.
– ప్రమాద ఘటన స్థలానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లేందుకు రూ.20వేలు, మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20వేలు అందిస్తారు.
– అంబులెన్స్‌ ఖర్చులకు రూ.15వేల ఆర్థిక సాయం.
– లాకర్‌పై 25శాతం రాయితీ.
– ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవు, రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చు .

==============
హెచ్డీఎఫ్‌సీ బీమా ప్రయోజనాలు:
– హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు సాలరీ ఎకౌంట్‌ ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల బీమా సొమ్ము అందిస్తారు. కాంట్రాక్ట్‌ కార్మికులైతే రూ. 20లక్షల బీమా అందుతుంది.
– హెడ్డీఎఫ్‌సీ డెబిడ్‌ కార్డు ఉంటే అదనంగా రూ. 10లక్షల ప్రమాద బీమా వర్తింపు
– ప్రమాదంలో శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.40లక్షల బీమా చెల్లింపు, కాంట్రాక్ట్‌ కార్మికులైతే రూ.20లక్షల చెల్లిస్తారు.
– ప్రమాదంలో ఉద్యోగి చనిపోతే పిల్లల చదువు కోసం రూ.4లక్షల ఆర్థిక సాయం.
– అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే రోజుకు వెయ్యి చొప్పున 15రోజుల పాటు ఆర్థిక సాయం ఏడాదికి గరిష్టంగా రూ. 15వేలు.
– ఉద్యోగి కుటుంబంలో నలుగురికి జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌, రూ.50వేల లోపు డిబెట్‌ కార్డు, రూ.5లక్షల ఉచిత ప్రమాద బీమా.

==============
హెచ్డీఎఫ్‌సీ బీమా ప్రయోజనాలు:
– హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు సాలరీ ఎకౌంట్‌ ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల బీమా సొమ్ము అందిస్తారు. కాంట్రాక్ట్‌ కార్మికులైతే రూ. 20లక్షల బీమా అందుతుంది.
– హెడ్డీఎఫ్‌సీ డెబిడ్‌ కార్డు ఉంటే అదనంగా రూ. 10లక్షల ప్రమాద బీమా వర్తింపు
– ప్రమాదంలో శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.40లక్షల బీమా చెల్లింపు, కాంట్రాక్ట్‌ కార్మికులైతే రూ.20లక్షల చెల్లిస్తారు.
– ప్రమాదంలో ఉద్యోగి చనిపోతే పిల్లల చదువు కోసం రూ.4లక్షల ఆర్థిక సాయం.
– అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే రోజుకు వెయ్యి చొప్పున 15రోజుల పాటు ఆర్థిక సాయం ఏడాదికి గరిష్టంగా రూ. 15వేలు.
– ఉద్యోగి కుటుంబంలో నలుగురికి జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌, రూ.50వేల లోపు డిబెట్‌ కార్డు, రూ.5లక్షల ఉచిత ప్రమాద బీమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text