రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ల పెళ్లి జులై 12 న జరగనుంది. మార్చిలో మొదటి వెడ్డింగ్ పూర్తి చేసుకున్న ఈ జంట,ఇప్పుడు మళ్లీ సెకండ్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. సెకండ్ వెడ్డింగ్ మే 29 నుంచి మొదలయి జూన్ 1 న పూర్తవుతుంది. మొదటి వెడ్డింగ్ భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరిపారు. దానికి మించి సెకండ్ వెడ్డింగ్ కి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఒక రేంజులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అంచనాలకు తగ్గకుండా అందుకు తగ్గ రీతిలోనే తన చిన్న కుమారుడి వివాహం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి వెడ్డింగ్ కోసం పూర్తి చేసుకున్న ఆ జంట ప్రస్తుతం సెకండ్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి సెకండ్ వెడ్డింగ్ ని క్రూయిజ్ షిప్ లో ప్లాన్ చేశారు. ఈ వెడ్డింగ్ మే 29 న ఇటలీ లో మొదలయి జూన్ 1 న ప్రాన్స్ లో పూర్తవుతుంది. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ వెడ్డింగ్…షిప్ లో 4380 కిలోమీటర్లు ప్రయాణము చేయనున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ల సెకండ్ వెడ్డింగ్ కి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 800 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్,అలియా భట్, దీపికా పదుకొనె, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, జాహ్నవి కపూర్, అనన్య పాండే పాల్గొంటున్నారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీతో హాజరవుతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రూయిజ్ షిప్ లో 600 మంది పనిచేసే సిబ్బంది వుండనున్నారు. వెడ్డింగ్ కి వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర గల వస్తువులను అంబానీ ఫ్యామిలీ గిఫ్టుగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
సెకండ్ వెడ్డింగ్ నాలుగు రోజులు పాటు జరగనున్న నేపథ్యంలో ఒక్కో రోజు ఒక్కో ఈవెంట్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్లు డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. మే 29 న ఇటలీలో క్రూయిజ్ షిప్ మొదలవుతుంది. మే 30 రోమన్ హాలిడే పేరుతో ఈవెంట్ ఉంటుంది దానికి ప్రాచీన గ్రీక్ రోమన్ దుస్తులు ధరిస్తారు. మే 31 న V టర్న్స్ వన్ అండర్ ది సన్ పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు. అదే రోజు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. జూన్ 1 న డోల్స్ వీటా అనే ఈవెంట్ తో సెకండ్ వెడ్డింగ్ పూర్తవుతుంది. ఈ సెకండ్ వెడ్డింగ్ కి అంబానీ ఫ్యామిలీ దాదాపు 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి.
అనంత్ అంబానీ మరియు రాధికల ఫస్ట్ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చిలో 1 నుంచి 3 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ వంటి విదేశీ ప్రముఖులు, బాలీవుడ్ సినీ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసన, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెన్ బర్గ్ ఇలా ఎంతో మంది అనంత్ అంబానీ, రాధికల ఫస్ట్ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు.బాలీవుడ్ అగ్ర హీరోలు త్రీఖాన్స్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ అనంత్ వెడ్డింగ్ లో డాన్స్ చేసి సందడి చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి తమ తమ సిగ్నేచర్ స్టెప్పులతో ఫ్రీ వెడ్డింగ్ వేడుకకి వచ్చిన గెస్టులని అలరించారు. 74 కోట్లు ఖర్చు చేసి హాలీవుడ్ సింగర్ రిహానాతో స్పెషల్ గా ఏర్పాటు చేసిన సింగిగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.