
పాలీక్యాబ్ ఇండియా అవగాహన సదస్సు
60ఏండ్ల మన్నిక ఉండే పాలీ క్యాబ్ సుప్రీమా వైరింగ్
హైదరాబాద్, జనవరి 17,2025: భవన నిర్మాణాల్లో నాణ్యమైన విద్యుత్వైరింగ్ను వినియోగించడమే విద్యుత్ ప్రమాదాల నివారణకు పరిష్కారమని పాలీక్యాబ్ ఇండియా అవగాహన సదస్సులో వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లో క్వాలిటీ వైరింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. పాలీ క్యాబ్ ఇండియా లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సామ్యూల్ ఆధ్యక్షత జనిగిన ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యులు,నక్క యాదగిరి, ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్ నేమాల బెనర్జీ, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నాణ్యతతో పాటు అధిక వేడిని తట్టుకొని ఎక్కువకాలం మన్నిక ఉండే వైరింగ్ను వాడాలని సూచించారు. డొమెస్టిక్ ఇక్విప్మెంట్లతో పాటు అగ్రికల్చర్ మోటార్లకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైర్లు అమర్చాలని చెప్పారు. అప్పుడే వినియోగదారులను, ప్రజలను, రైతులను ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని వెల్లడించారు.






105 డిగ్రీల ఉష్ట్రోగతతో కరెంట్సరఫరా జరిగినా మెల్ట్కాకుండా తట్టుకునే వైరింగ్వాడితేనే షార్ట్ ర్క్యూట్ తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా 60ఏండ్ల మన్నిక ఉండే పాలీ క్యాబ్ సుప్రీమా వైరింగ్ను ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమంలో ప్రతినిధులు రాజశేఖర్ గౌడ్, సుమన్, జనార్ధన్. కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్లోని పాలీ క్యాబ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం నుంచి రాణీగంజ్ వరకు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.


