
ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో జగ్గారెడ్డి
వడ్డి రామానుజం దర్శకత్వంలో చిత్రం
2026 ఉగాదికి రిలీజ్
సిల్వర్ స్ర్కీన్పై సెకండ్ ఆఫ్ లో సినిమా చివరి వరకు
వెల్లడించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 10,2025
జగ్గుబాయ్కి సినిమా ఛాన్స్ దక్కింది.తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో జగ్గారెడ్డి తన నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నారు.
ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో నిర్మితమవుతున్న ఈ సినిమా 2026 ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జగ్గారెడ్డి పాత్ర ఇంటర్వెల్ ముందు వచ్చి, సినిమా ఎండింగ్ వరకు ఉంటుంది.

తాజాగా ఈ సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తున్నాయి. ప్రత్యేక స్టయిల్లో జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో కనిపించడంతో, జగ్గారెడ్డి తెరంగేట్రం అంశం అటు జనాల్లో ఇటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నాని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఎమ్మెల్సీ గా అవకాశం దక్కుతుందనుకున్న జగ్గారెడ్డికి చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ లిస్టులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లకు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డికి సినిమా ఛాన్స్ దక్కడం గమనార్హం.
