
నర్సరీ మేళాకు అనూహ్య స్పందన
ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన
ఆకట్టుకుంటున్న రకరకాల పూలమొక్కలు
అరుదైన పండ్ల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్
ఎక్సాటిక్, ఇంపోర్టెడ్, దేశీయ, విదేశీ పూల మొక్కలు
బోన్సాయ్, క్రీపర్స్, ఆడేనియం, బల్బ్ రకాలు, సీడ్స్, విత్తనాలు
కిచెన్ గార్డెన్ మొక్కలు, ఇండోర్ , అవుట్‌డోర్ ప్లాంట్స్
టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ కు అనువైన పరికరాలు
గ్రీనరీ ప్రియులతో హార్టీకల్చర్షో సందడి
హైదరాబాద్ : కాంక్రీట్ జంగిలంగా మారుతున్న నగర జీవనంలో పచ్చదనం, ప్రకృతి సౌందర్యానికి ఆకాంక్షపడుతున్నవారికి గుడ్‌న్యూస్. హైదరాబాద్‌లోని ఐమాక్స్ సమీపంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటోంది. గ్రీనరీ ప్రియులు, సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళా ప్రత్యేక ఆకర్షణగా అగ్రి, హార్టీకల్చర్ షో నిర్వహిస్తున్నారు.
నగరంలో టెర్రస్ గార్డెనింగ్, గ్రీనరీ అవసరం పెరిగిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తోంది. సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ రకాల మొక్కలు, పూల మొక్కలు, గార్డెనింగ్ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నర్సరీ ఉత్పత్తులతో ఈ మేళా కొలువుదీరింది.



ఈ మేళాలో 120 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అరుదైన, ఎక్సాటిక్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్, కిచెన్ గార్డెన్ మొక్కలు, అవుట్‌డోర్ ప్లాంట్స్, బల్బ్ రకాలు, సీడ్స్, ఇండోర్ ప్లాంట్స్, ఆడేనియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఇంపోర్టెడ్ వేరైటీలు ప్రదర్శిస్తున్నారు.
భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల అరుదైన పూల మొక్కలు ఇక్కడ చూడవచ్చు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి ఆధునిక, సరికొత్త గార్డెనింగ్ పద్ధతులను ప్రదర్శిస్తున్నారు. బోన్సాయ్ గార్డెన్‌కు సంబంధించిన అలంకరణ సామగ్రి, డెకరేషన్ మెటీరియల్ ఆకట్టుకుంటున్నాయి. రైతులకు, పట్టణ ప్రాంత గార్డెనర్లకు పాట్స్, పాటింగ్ మెటీరియల్, ఇతర అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ మేళా ఉపయోగపడుతోంది.




ఉత్తర భారత రాష్ట్రాలైన హర్యానా, వెస్ట్ బెంగాల్ నుంచి, దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి నర్సరీ యజమానులు, సప్లయర్లు పాల్గొంటున్నారు. మేళా ఇన్‌చార్జీ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ వాసులు ఈ ప్రదర్శనను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ మేళా జనవరి 26 వరకు ఆదివారం, సోమవారాల్లో కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు, గార్డెనింగ్ ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


