
టీజీ ఈఏపీసెట్-2026 పరీక్షల షెడ్యూల్ ప్రకటన
హైదరాబాద్, జనవరి 30: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్-2026) పరీక్షల షెడ్యూల్‌ను ఆధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జేఎన్‌టీయూహెచ్ రెక్టర్, ఈఏపీసెట్ కన్వీనర్ డా. కె. విజయకుమార్ రెడ్డి గురువారం ప్రెస్ రిలీజ్ జారీ చేశారు.
జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఈటీ కమిటీ మొదటి సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఆమోదించారు. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసీహెచ్‌ఈ) చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ. ఈ. పురుషోత్తమ్, ప్రొ. ఎస్‌కే మహ్మూద్, సెక్రటరీ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్, కో-కన్వీనర్ ప్రొ. బి. బాలు నాయక్‌తోపాటు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పరీక్షల షెడ్యూల్ వివరాలు:
- నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 14, 2026 (శనివారం)
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 19, 2026 (గురువారం)
- లేట్ ఫీజు లేకుండా దరఖాస్తుల చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026 (శనివారం)
- పరీక్షల తేదీలు:
- అగ్రికల్చర్ & ఫార్మసీ: మే 4 & 5, 2026 (సోమవారం & మంగళవారం)
- ఇంజినీరింగ్: మే 9 నుంచి 11, 2026 (శనివారం నుంచి సోమవారం వరకు)

పరీక్షల సిలబస్ మొదటి, రెండో ఇంటర్మీడియట్ సిలబస్‌కు 100% అనుగుణంగా ఉంటుందని కన్వీనర్ స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్ www.eapcet.tsche.ac.in లేదా ఈ-మెయిల్ tgeapcet2026@jntuh.ac.in ను సంప్రదించవచ్చు.

