- అర్ధరాత్రి ఫిల్మ్ నగర్ లో బోల్తా కొట్టిన కారు
- స్వల్ప గాయాలతో బయటపడ్డ శర్వానంద్

హైదరాబాద్, మే 28
టాలీవుడ్ హీరో శర్వానంద్ కారుకు యాక్సిండెంట్ అయింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్ధరాత్రి ఫిల్మ్ నగర్‌లోని ఓ జంక్షన్ వద్ద బైక్ ను తప్పించ బోయి అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు స్థానికులు ఆయనను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం శర్వా నంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.
హైఎండ్ కారు కావడంతో, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం తర్వాత శర్వానంద్ కారు వద్ద నిల్చొని పోలీసులతో మాట్లాడిన వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. మరోవైపు శర్వా పెళ్లి ఆయన ప్రియురాలు రక్షిత రెడ్డితో జైపూర్ ప్యాలెస్ లో వచ్చే నెల తొలి వారంలో జరగనుంది. ఇంతలో ఆయనకు ప్రమాదం కావడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
-టీమ్ శర్వానంద్