



76 ఏళ్ల తరువాత మళ్లీ కొలువు దీనిన సింఘోల్
న్యూఢిల్లీ, మే 28
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తిరువావడుదురై ఆధీనం మఠం నెహ్రూకు ఇచ్చిన రాజదండాన్ని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టించింది.
ఈ రాజదండాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి సంకేతంగా నెహ్రూ అందుకున్నారు.
‘‘1947లో లార్డ్ మౌంట్ బాటన్ సెంగోల్‌ను స్వీకరించి దాన్ని నెహ్రూకు ఇచ్చారు’’ అని తిరువావడుదురై మఠానికి చెందిన అంబలవన దేశీగ పరమచార్య స్వామిగల్ తెలిపారు.
ఈ రాజదండం నేపథ్యానికి సంబంధించి, ఒక సంఘటనను కేంద్ర ప్రభుత్వం వివరించింది.
“భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే రోజు సమీపిస్తుండగా, అధికార మార్పిడికి గుర్తుగా ఏదైనా కార్యక్రమం చేపడుతున్నారా అని అప్పటి జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, నెహ్రూని అడిగారు. ఈ విషయంలో నెహ్రూ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియ సి.రాజగోపాలాచారి(రాజాజీ) సలహాను కోరారు.
రాజాజీ వెంటనే ఒక ఆలోచన చేశారు. చోళులు ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికారం బదిలి చేసే సమయంలో ఇచ్చే సమయంలో ఒక రాజదండాన్ని మార్చుకునే వారని గుర్తు చేసుకున్నారు. అలాంటిదే రాజదండం తయారు చేసి, బ్రిటీష్ వారి నుంచి అధికార బదిలీకి చిహ్నంగా ఉపయోగించాలని భావించారు. తనకు అయిదు అడుగుల పొడవు గల రాజదండం కావాలని తంజావూరులోని తిరువావడుదురై ఆధీనం మఠాధిపతిని కోరారు రాజాజి.
చెన్నైకి చెందిన ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ అనే సంస్థ ఈ రాజదండాన్ని రూపొందించింది. ఆగస్ట్ 14న ముగ్గురు వ్యక్తులు దండాన్ని తీసుకుని ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆ ముగ్గురూ వ్యక్తులలో ఒకరు అధీనం మఠం ఉపప్రధాన పూజారి కుమారస్వామి తాంబిరన్ కాగా, రెండోవారు నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై, మూడో వ్యక్తి మఠం గాయకుడు మాణిక్కం.
ఈ ముగ్గురు ఆ దండాన్ని లార్డ్ మౌంట్‌బాటన్ చేతిలో పెట్టి, తిరిగి తీసుకున్నారు. తర్వాత దానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై దానినిక నెహ్రూకు ఇచ్చేందుకు ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రధాన అర్చకులు దేవర కీర్తనలు ఆలపిస్తుండగా నెహ్రూ దాన్ని అందుకున్నారు’’.

ఇన్నాళ్లు మ్యూజియంలో ఉన్న ఈ రాజదండం ఆదివారం ప్రారంభమైన కొత్త పార్లమెంట్లో ప్రతిష్టించారు.