
బీసీ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి
67 సెగ్మెంట్‌లలో బీజేపీకీ సానుకూలం
బీసీ సీఎం నిర్ణయంతో బీసీ వర్గాలు ఏకమవుతున్నయి
బీసీ సంఘాలు, కులసంఘాల మద్దతు
ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, సెప్టెంబరు 22
అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 40సీట్లు బీజేపీ గెలుస్తుందనీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్‌మీడియా మెంబర్ పెరిక సురేష్ స్పష్టం చేశారు. బుధవారం ఆయనమీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణతో 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కి సానుకూల వాతావరణం కనబడుతోందన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్నారనీ, అవినీతి పాలన పోవాలని చర్చించుకుంటున్నారు.75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మొదటిసారి ఓ జాతీయ పార్టీ బీసీని సీఎం చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ సామాజిక వర్గంలో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. కులసంఘాలు సమావేశాలను నిర్వహించి బీజేపీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇది బీజేపీకి అదనంగా కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో బీసీ సామాజిక వర్గం కీలకపాత్ర పోషించిందన్నారు. బీసీని సీఎం చేయడానికి బీసీ వర్గాలన్నీ ఏకమై ముందుకొస్తున్నాయని, విద్యావంతులు, మేధావులు కూడా ముందుకొస్తున్నారనీ స్పష్టం చేశారు. బీజేపీ కేంద్రంలో బీసీలను 27 మందికి అంటే 35శాతం మంది కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పలించిందన్నారు. ఎక్కువ సంఖ్యలో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. 10 ఉమ్మడి జిల్లాలు 66 అసెంబ్లీలు ప్రతీ జిల్లాకు మీటింగులు నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ , రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మన్ నేతృత్వంలో పార్టీ బలంగా ఉన్న 67 స్థానాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తనతో సహా బీజేపీ నేతలు సుభాష్ చందర్ జీ, ఆలే భాస్కర్ , బూర నారయ్య గౌడ్, వీరేందర్ గౌడ్ తదితర 5మందితో ప్రత్యేక కమిటీ వేసినట్లు చెప్పారు. తాను కోఆర్డినేటర్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో భాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.15 కులసంఘాల ప్రతినిధులతో నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు, దళిత సీఎం, వారసత్వ రాజకీయాలు, అవినీతి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీసీలతో ప్రతి రోజు 3వేల మందితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు సురేష్ వెల్లడించారు.

