
న్యూఢిల్లీ, డిసెంబర్01:
సిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ 24వ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా మంజిందర్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మద్రాసు రెజిమెంట్ కు చెందిన ఆర్మీ సీనియర్ అధికారి కల్నల్ మంజిందర్ సి౦గ్ సిమ్లా కేంద్రంగా ఉన్న 24వ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
లెఫ్ట్‌నెంట్ జనరల్ మంజిందర్ సింగ్ కపుర్తలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమికి చెందిన సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. అదే విధంగా డెహ్రాడూన్‌లోని ఖడక్‌వస్లా ఇండియన్ మిలటరీ ఆకాడమిలో శిక్షణ పొందారు. గత 1986లో మద్రాస్ 19 వ బెటాలియన్ సెకండ్ లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ కమాండెంట్ ఆఫీసర్‌గా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ప్రతికూల వాతావరణంలో దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను కౌంటర్ ఇంటలీజెన్స్ ద్వారా పసిగట్టి ఆకస్మిక దాడులతో తిప్పికొట్టిన సింగ్ నాయకత్వ పటిమకు గుర్తింపుగా 2015 లో యుద్ధ సేవా పతకం , 2019లో విశిష్ట సేవా పతకాలు వరించాయి.
మద్రాస్ రెజిమెంట్ లో గత 2021 నుంచి మంజిందర్ సింగ్ కల్నల్ గా సేవలు అందించారు. ఈకాలంలో తమిళనాడులోని నీలగిరి జిల్లా, వెల్లింగ్టన్‌లోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌ను పర్యవేక్షించి శిక్షణ, అడ్మినిస్ట్రేటీవ్ ప్రమాణాలతో రెజిమెంట్ ప్రతిష్టను మరింత పెంచారు.
తాజాగా మంజిందర్ సింగ్ సీమల్లాలో ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌గా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మద్రాస్ రెజిమెంట్ కు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.