హైదరాబాద్, డిసెంబరు 03
తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా 8సీట్లు గెలుచుకుంది. రాజాసింగ్ హాట్రీక్ కొట్టి విజయదుంధుబి మోగించగా మిగతా గెలిచిన వారిలో చాలా వరకు అనేక సార్లు పోటి చేసి ఓడిపోయిన వారే ఇప్పుడు విజయం సాదించడం గమనార్హం. అయితే పార్టీ హేమాహేమీలు జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు వంటి నేతలతో పాటు ఈటల రాజేందర్ ఓటమి పాలవడం గమనార్హం.మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కూడా ఈ సారి ఓటమి చవి చూశారు. తెలంగాణ వచ్చిన తరువాత బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం

బీజేపీ గెలిచిన స్థానాలు
1.ఆదిలాబాద్ పాయల్ శంకర్(BJP)
2.గోషామహల్ రాజా సింగ్(BJP)
3.నిజామాబాద్ అర్బన్ Dసూర్యనారాయణ(BJP)
4.ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి(BJP)
5.నిర్మల్ మహేశ్వర్‌రెడ్డి(BJP)
6.సిర్పూర్ హరీష్‌బాబు(BJP)
7.కామారెడ్డి వెంకటరమణరెడ్డి(BJP)
8.ముదోల్ రామారావు పటేల్(BJP)
19 సీట్లలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ
బీజేపీ రెండో స్థానంలో ఉన్న నియోజక వర్గాలు ఇవి….
- అంబర్ పేట
- బోథ్
- చాంద్రాయణగుట్ట
- చార్మినార్
- దుబ్బాక
- గజ్వేల్
- హుజురాబాద్
- కల్వకుర్తి
- కరీంనగర్
- కార్వాన్
- కోరుట్ల
- మహేశ్వరం
- మంచిర్యాల్
- కుతుబుల్లాపూర్
- రాజేంద్రనగర్
- సనత్ నగర్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్
- వరంగల్ ఈస్ట్
- ఎల్బీ నగర్