
హైదరాబాద్, డిసెంబరు 03
పాతబస్తీలో అత్యంత ప్రజాధరణ కలిగిన పార్టీగా పేరున్న మజ్లిస్ పార్టీకి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అవే స్థానాలను గెలుచుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో గెలిచిన 7స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి మళ్లి పాత సీట్లనే దక్కించుకుంది. ఫలితంగా గతంలో గెలుచుకున్న సిట్టింగ్ స్థానాలనే కాపాడుకున్నట్లయింది. పార్టీ గతంలో గెలుచుకున్న నాంపల్లి, యాకత్ పుర స్థానాలను మజ్లిస్ పార్టీ చేజార్చుకుంటుందని భావించినా చివరకు నిలుపుకున్నది. ఈ సారి పోటీలో నిలిచిన రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పడినట్లయింది..

మజ్లిస్ పార్టీ గెలిచిన స్థానాలు
1.చార్మినార్ మీర్ జుల్ఫీకర్ అలీ (MIM)
2.చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ (MIM)
3.బహదూర్‌పుర మహ్మద్ ముబీన్ (MIM)
4.యాకత్‌పుర జాఫర్ హుస్సేన్ మెరాజ్((MIM)
5.నాంపల్లి మాజీద్ హుస్సేన్(MIM)
6.కార్వాన్ కౌసర్ మొహినోద్దీన్(MIM)
7.మలక్‌పేట్ అహ్మద్ బలాల(MIM)