
9రోజుల పాటు మహా యజ్ఞం
పాల్గొన్న 1008 మంది దంపతులు
తమకు అవకాశం దక్కడం అదృష్టం
హైదరాబాద్, జనవరి 23
ప్రతీ హిందువు అయోధ్యలో కొలువుదీరిన కోదండ రామున్ని దర్శించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలని అఖిల భారత ధర్మాచారీ పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో పెరిక సురేష్ మాట్లాడుతూ.. ఆయోధ్యలో ప్రాణప్రతిష్టతో బాల రాముని ఆలయం ప్రారంభమై 500ఏళ్ల హిందువుల కల నెరవేరిందని అన్నారు. 1008 దంపతులు పాల్గొన్న శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞంలో సతీమణి పల్లవీతో కలిసి జంటగా జనవరి 14 మకరసంక్రాంతి నుంచి 9రోజుల పాటు పాల్గొనే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్పారు.


ఆయోధ్య క్షేత్ర తీర్థ ట్రస్ట్ చంపక్ రాయ్ ఆధ్వర్యంలో శ్రీరాం భద్రాచార్య, బాగేశ్వర దామ్ దీరేంద్రశాస్త్రీ, సమక్షంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిత్యం 9రోజుల పాటు హోమాల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు.

ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతున్న వేళ.. తాను తన జీవిత భాగస్వామితో యజ్ఞంలో, ఉపవాస దీక్షలో పాల్గొనడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. ఈ ఘట్టంలో భాగస్వామ్యం అయిన ప్రతీ హిందువుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పెరిక సురేష్ వివరించారు.

