
హైదరాబాద్, ఫిబ్రవరి 02
అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఓబీసీ మోర్చా సోషల్ మీడయా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడిన వారికి మా మద్దతు తప్పక ఉంటుందని చెప్పారు. బీసీల్లో అత్యంత వెనుకబడి రాజకీయాలకు దూరంగా ఉన్న పెరిక సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పెరిక సామాజిక వర్గానికి చెందిన సురేష్ లాంటి యువ, బీసీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. విద్యావేత్తగా వ్యాపారవేత్తగా, ధార్మిక నేతగా మంచి పేరున్న బీసీ నేత సురేష్‌కు తమ మద్దతు తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దమని ప్రకటించారు.