
వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
క్రికెట్, సెపక్ తక్రా
ఖేలో ఇండియా జీతో నల్లగొండ పేరుతో క్రీడలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రీడా పోటీల పోస్టర్‌ను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరం విద్యతో పాటు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపకులు, బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు ఖేలో ఇండియా జీతో క్రికెట్, సెపక్ తక్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ పోటీలు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 41 మండలాల్లో నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లుపైబడిన యువతతో ప్రతి మండలంలో ఒకటీమ్‌ను ఎంపిక చేసి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ పోటీలు ఈ నెల 23 నుంచి 26 వరకు మొదటి దశలో నియోజకవర్గ స్థాయిలో మండలాలమ, రెండవ దశలో పార్లిమెంట్ స్థాయిలో నియోజకవర్గాల మధ్య పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. పార్లమెంట్ స్థాయిలో విజేత నిలిచిన జట్టుకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందిస్తామని తెలిపారు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మండలానికి ఒక టీమ్‌ను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 18లోగా మండలాల వారిగా పేర్లను 9347777794, 7013720903నంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈనెల 24 నుంచి 25 వరకు సెపక్ తక్రా పోటీలు
గ్రామీణ ప్రాంతాల్లో సెపక్ తక్రాను ప్రమోట్ చేయడానికి తెలంగాణ, నల్గొండ సెపక్ తక్రా అసోసియేషన్ , వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో 9వ సబ్ జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 24, 25 తేదీల్లో నల్గొండ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పెరికె సురేష్ కోరారు.
