
శ్రీశైలంలో నిర్మిస్తున్న కాటేజ్‌లకు విరాళం అందించిన సురేష్
హైదరాబాద్, ఫిబ్రవరి 13
ధార్మిక విధానాన్ని కొనసాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో పెరిక సంఘం నిర్మిస్తున్న 57 కాటేజ్‌లు నిర్మాణం కోసం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ దైవచింతనతో పాటు గుళ్లు, బడులను వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలోని శిథిలావస్థలో ఉన్న 100గుళ్లలో దూపదీప నైవథ్యం కోసం ఆర్థిక సహాయం, 100 బడులలో మౌళిక వసతుల కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే 28గుళ్లు, 11 స్కూళ్లుకు ఆర్థికసాయం అందించామని వివరించారు. గతంలో తిరుమలలో చేపట్టిన 12 కాటేజ్‌ల నిర్మాణానికి విరాళం అందించినట్లు చెప్పారు. ఆయోధ్యలో శ్రీబాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా 1008 దంపతులతో 9రోజుల నిర్వహించిన మహాయాగంలో పాల్గొని దేవదేవుని ఆశీస్సులు అందుకున్నట్లు వివరించారు. 10వేల మందికి అన్నధాన కార్యక్రమం నిర్వహించామని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ధార్మిక చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సురేష్ వివరించారు.
