
సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దానం
గత 2004లో ఇదే సీటు ఆఫర్ ఇచ్చినా నో అన్నడు
ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండీ కాంగ్రెస్ పార్టీలో చేరారు
నేడు మళ్లీ ఎంపిగా కాంగ్రెస్ నుంచి పోటీ
మరోసారి తన భవిష్యత్తు పరీక్షించుకోనున్న దానం
హైదరాబాద్, మార్చ్ 21
సంచలనాలకు మారుపేరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పేరున్న నాయకునిగా గుర్తింపు ఉన్న దానం యువజన కాంగ్రెస్ నేతగా, ఆసీఫ్‌నగర్ ఎమ్మెల్యేగా, గత 2009, 2018, 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో దానంపై వేటు వేయాలని ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కాగా గురువారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో మరోసారి దానం సంచలనాకు కేంద్రబిందువుగా మారారు.

దానం రాజకీయ ప్రస్తానం..
యువజన కాంగ్రెస్ నేతగా దానం నాగేందర్ తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. మెదట అమ్మటి ఖైరతాబాద్ ఎమ్మల్యే దివంగత పీ జనార్థన్‌రెడ్డి (పీజేఆర్) శిష్యుడిగా ఉన్న దానం అనంతరం వైఎస్ రాజశేఖరెడ్డి ప్రధాన అనుచరునిగా రాజకీయాల్లో ఆరు తేరారు. గత 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) మేయర్‌గా పోటీ చేసిన దానం నాగేందర్ అప్పటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. అనంతరం గత 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆసీఫ్‌నగర్ సీటు కేటాయించక పోగా, సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు అవకాశం లభించినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎంపీ అవకాశాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాత్రికి రాత్రే పార్టీ మారి తెలుగుదేవం పార్టీలో చేశారు. 2004లో టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆధికారం కోల్పోవడంతో గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలువలేదు. 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తనకు అత్యంత సన్నిహితుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావడంతో దానం టీడీపీ నుంచి గెలిచినా తిరిగి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో అదే ఆసీఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చవి చూశారు. అప్పుడు అక్కడ ఎంఐఎం అభ్యర్తి గెలుపొందారు. గత 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి దానం విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం గత2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిచేతిలో ఓటమి చవి చూశారు. తిరగి 2018లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన అప్పటి టీఆర్‌ఎస్ పార్టీలో చేశారు. ఖైతరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో దానంపై వేటు వేయాలని ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కాగా గురువారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సంచనాలకు మారు పేరుగా మారిన దానం నాగేందర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థిగా ఏమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే..


