
వరంగల్ నుంచి సదానందంకు అవకాశం కల్పించాలి
ఎఐసీసీకి ఐఎన్‌టీయుసీ సిఫారసు
బలమైన అభ్యర్థిగా సూచించిన జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి
హైదరాబాద్, మార్చ్ 09
వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జెన్‌కో ఇంజనీర్ పరికి సదానందంకు అవకాశం కల్పించాలనిఎఐసీసీకి ఆపార్టీ కార్మిక విభాగం ఐఎన్‌టీయుసీ సిఫారసు చేసింది. ఈ మేరకు ఐఎన్‌టీయుసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూచించారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఇంజనీర్ సదానందం పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ కొనసాగుతున్నారని తెలిపారు. అత్యంత బలమైన సామాజిక వర్గం ప్రతినిధిగా, 20ఏళ్లకు పైగా ఉద్యోగసంఘాల్లో కీలక భూమిక పోషిస్తూ కార్మిక, ఉద్యోగ, సమాజిక వర్గాలు ఇలా అన్ని వర్గాల మద్దతున్నదని స్పష్టం చేశారు. వరంగల్ పార్లమెంట్ సీటు సదానందంకు కేటాయించడంతో పార్టీ విజయం సులభతరం అవుతుందని ఎఐసీసీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డికి ఐఎన్‌టీయుసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సూచించారు.

