మనవడితో హోలీ జరుపుకున్న సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చ్ 25
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడితో హోలీ వేడుకలు జరుపుకున్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో తన మనువడు, సతీమణితో కలిసి ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ హోలీ నిర్వహించుకున్నారు. రాజకీయాలు, నిరంతరం సమావేశాల్లో, పరిపాలనలో మునిగితేలే నేతగా, సీఎంగా రేవంత్‌రెడ్డి ఓవైపు బీజీగా ఉంటూనే హోలీ పండుగ రోజున తన కుటుంబ సభ్యులు, మనవడితో కలిసి హోలీ జరుపుకున్నారు. ఈ ఫోటోలను ఆయన ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు హర్షం వెలిబుచ్చారు.