
కమా టైటిల్ కాపీ కొట్టారుః
ఫిలిం ప్రొడ్యూసర్ కర్మికొండ నరేంద్ర
సినిమా టైటిల్ కాపీ తో మరో సారి వివాదంలోకి శేఖర్ కమ్ముల
హైదరాబాద్, ఏప్రిల్ 14
శేఖర్ కమ్ముల సినిమా టైటిల్ కాపీ తో మరో సారి వివాదంలోకి చిక్కుకున్నారు.. గతంలో సరంగదరియా పాటను కాపీ చేసారని ఓ గాయని అప్పట్లో ఆరోపించి వివాదం రేపగా.. తాజాగా తన సినిమా టైటిల్ నే కాపీ కొత్తరంటూ ఓ ఫిలిం ప్రొడ్యూసర్ కోర్టును ఆశ్రయించారు.. వివరాల్లోకి వెళితే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ హీరోగా కుబేరా అనే టైటిల్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ అనే బ్యానర్ పై ఐదు భాషల్లో భారీ బడ్జెట్ చిత్రం తెరకు ఎక్కుతోంది.. అయితే ఇదే కుబేరా టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకుని సినిమా తీస్తున్నట్లు ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్రకటించడంతో పాటు కోర్టు ఆశ్రయించడం వివాదానికి తెరలేపింది

కుబేర సినిమా టైటిల్‌ను కాపీకొట్టి సినిమా తీయడం అన్యాయమని ఫిలిం ప్రొడ్యూసర్ కర్మికొండ నరేంద్ర ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుబేర సినిమా టైటిల్‌తో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేసుకున్నామనీ, ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ దశలో ఉందన్నారు. అయితే తాజాగా వేరే వాళ్లు తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను కాపీకొట్టి ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారని ఆరోపించారు. కాపీ టైటిల్ తో శేఖర్ కమ్ముల అనే డైరెక్టర్ తమిళ్ సినిమా హీరో ధనుష్ హీరోగా కుబేరా సినిమా తీస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. ఈ విషయమై ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేస్తే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో తాము హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.
తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌తో సినిమా తీయడం కరెక్ట్ కాదన్నారు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమా తీస్తే చివరి దశలో ఉండగా మా టైటిల్ ను కాపీ కొట్టడం.. మా టైటిల్ తో సినిమా తీయడం అనేది బాధాకరమని అన్నారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తమ టైటిల్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ అనే బ్యానర్ వాళ్ళకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందన లేదన్నారు. దీనికి తోడు వాళ్ల బ్యాగ్రౌండ్ పెద్దది వాళ్లను మీరేం చేయలేరు అన్నట్టు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము కోర్టును ఆశ్రయించామని, అవసరమైతే తాము ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమన్నారు. ఇప్పటికైనా స్పందించి మా టైటిల్ మాకే వర్తించేలా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చర్యలు తీసుకోవాలని నరేంద్ర కోరారు.
