
హైదరాబాద్ ఏప్రిల్ 15
హైదరాబాద్ రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ కు చెందిన డాక్టర్ అచ్యుతాదేవి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వియత్నాంలో క్యూహన్లో నగరంలో ఔషధ మొక్కలు సహజ ఉత్పత్తులు 2024 అనే అంశంపై జరిగిన ఇంటర్నేషనల్ సెమినార్ లో వక్తగా పాల్గొని తన ప్రతిభను చాటారు. క్యూహన్లో ఏప్రిల్ 15 నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ అచ్చుతాదేవి తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. డాక్టర్ అచ్యుతాదేవితో పాటు డాక్టర్ రవి కిరణ్ పాల్గొన్నారు.

వియత్నాం హనాయ్ యూనివర్సిటీ, ఇండోనేషియా కు చెందిన మారనాద క్రిస్టియన్ యూనివర్సిటీ, ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మలేషియన్ యూనివర్సిటీ లతో ఈ సందర్భంగా మెమొరండం ఆఫ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యం డాక్టర్ ముత్యంరెడ్డి డాక్టర్ సుదర్శన్ రెడ్డి అచ్యుతా దేవిని అభినందించారు



