ప్రపంచంలోనే అత్యధిక యువత వున్న దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో వుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం. 18 నుంచి 25 వరకు గల యువతీ, యువకుల ఓట్లు ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తాయి.అలాంటి యువత ఓటు చిన్ని చిన్ని కారణాలతో ఓటు వేయ ముందుకు రావట్లేదు. యువత ఓటు వేయకపోతే జరిగే అనర్ధాలు ఏంటి. యువత ఓటు వేయకపోవడం వెనుక వున్న కారణాలేంటి..
ప్రస్తుతం జరగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్లలో యువత ప్రధాన పాత్ర పోషించబోతోంది. అత్యధిక యువత వున్న దేశంగా మొదటి స్థానంలో వున్నప్పటికీ, యువత ఓటు వేసేందుకు ముందుకు రావట్లేదు. దేశ జనాభాలో 50 శాతం జనాభా మధ్య వయసున్నవారే వుండడం విశేషం. రాజకీయాల యువతకి రోజురోజుకి విరక్తి కలగటం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. రాజకీయాలు అంటే అవినీతితో కూరుకుపోయినవిగా నేటితరం యువత భావిస్తున్నారు. ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తును మార్చగల శక్తి యువతకి వున్నప్పటికీ ఓటు వేసేందుకు ముందుకు రావట్లేదు.
2014,2019 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంలో యువత ఓట్లే ప్రధాన పాత్ర పోషించాయి. 2014 లో 37 శాతం ఓట్లు వేస్తే, 2019లో 41 శాతం యువతరం బీజేపీకి వేశారు. నగరాలలో వుండే యువత కన్నా ..గ్రామీణ ప్రాంతాల్లో వుండే యువతనే రాజకీయాలపై అధికంగా ఆసక్తి చూపుతున్నారని సర్వేలో వెలువడింది. నగరాలలో వుండే యువతి, యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చి పట్టణాల్లో స్థిరపడ్డారు. రాజకీయ పార్టీల పట్ల వారికి వున్న అభిప్రాయాల వల్ల ఎన్నికల సందర్భంలో ఓటు వేసేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళరు.. యువకులు ఓటు వేయకపోతే అసమర్థులు రాజ్యాన్ని ఏలుతారని విశ్లేషకులు అంటున్నారు. యువత మేలుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది.
యువత ఓటు వేయకపోవటానికి పలు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నో ఏళ్లనాటి నుండి పేదవారికి సరైన న్యాయం జరగకపోవడం. విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు రాకపోవటం లాంటి పట్ల యువత ఓటు వేసేందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో విద్యార్థులకు ఇస్తానన్న ఉద్యోగ ప్రకటన చేయకపోవటం. రాజకీయాల్లో అవినీతిపరులు అధికంగా పెరిగిపోవటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నా ఒక్క ఓటుతో ఏ మార్పు వస్తుందిలే.. అని యువత ఓటు వేయకుండా ఆగిపోతున్నారు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలుకోలేకపోతున్నారు. యువత మౌనంగా వుండటం వల్ల దేశ భవిష్యత్తు వెనక్కి వెళ్తుంది.. యువత పోలింగ్ బూతుల్లో ఓటుకోసం 5 నిమిషాలు కేటాయించకపోతే 5 ఏళ్ళు అవినీతిపరులు రాజ్యం ఏలుతారు అని విశ్లేషకులు చెబుతున్నారు.
