
లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు శాలువా కల్పి సత్కరించి అభినందనలు తెలుపుతున్న బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఎన్నిక పట్ల హర్షం
వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టడం అభినందనీయం
బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, జూన్26
స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కల్పి అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ లోక్ సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా 18వ లోక్ సభ స్పీకర్ గా మూజువాణీ ఓటుతో గెలుపొందడం పట్ల పెరిక సురేష్ హర్షం ప్రకటించారు. రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా వరుసగా మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారని తెలిపారు. వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వెలిబుచ్చారు.

17వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా చరిత్ర పుటల్లోకి ఎక్కారని సురేష్ గుర్తు చేశారు. ఆయన ఆకుంటిత దీక్ష, పట్టుదల, దేశసంక్షేమానికి, ప్రజలకు ఆయన చేసిన అవిశ్రాంత సేవలు, అంకిత భావం మరింత ముందుకు సాగాలని సురేష్ ఆకాంక్షించారు.