
ఆధార్ నెట్ వర్కింగ్‌లో సాంకేతిక సమస్యలు
హైదరాబాద్ జూలై 11: దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు గురువారం నిలిచిపోయాయి. #UIDAI నెట్ వర్కింగ్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఈ సమస్య తలెత్తింది. దాంతో ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ తదితర సేవలు నిలిచిపోయాయి. ఆ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వీసులపైన పడింది. రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూల్ చేశారు.

