దేవుడి దర్శనం కోసం తిరుపతిలో తొక్కిసలాట…

మృతుల్లో నలుగురు తమిళనాడు మహిళలు..

వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

తిరుపతి, జనవరి 08,2025

తిరుపతి లో ఆరుగురు భక్తుల మృతి మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన 20 మంది తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 9 మందికి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు.
దర్శనం టికెట్ల కోసం క్యూ లైన్ లోకి వెళ్ళిన భక్తులు ఊపిరాడక నలిగిపోయారు.‌
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తిరుపతిలోని కౌంటర్ల వద్ద భారీగా చేరుకున్న భక్తజనం మధ్య బుధవారం తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, భూదేవి కాంప్లెక్స్, బుధవారం రాత్రి తోపులాటలో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన దేవుడు దర్శనం కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాట జరిగి ఏకంగా రెండు రోజుల ముందుగానే వైకుంఠ ప్రాప్తి చెందారు. ఈనెల 10 ,11, 12 తేదీల మూడు రోజులకు గాను సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ తిరుపతిలో 8 ప్రాంతాల్లో దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ వాసుడు దర్శనం కోసం టోకెన్లు పొందేందుకు తిరుపతి లో భక్తులు గురువారం ఉదయం ఐదు గంటలకు ఈ టోకెన్లు జారీ చేస్తారు అని తెలిసి కూడా ముందు రోజైన అంటే బుధవారం మధ్యాహ్నం నుండి ఈ టోకెన్లు పొందేందుకు భారీ ఎత్తున కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. అయితే వీరిని క్యూ లైన్ లోకి ప్రవేశించకుండా బయట రోడ్డుపైనే నియంత్రించిన పోలీసులు అటు తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి గేట్లు తెరవడంతో క్యూలైన్లోకి వెళ్లేందుకు భక్తులందరూ ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో తొక్కిసలాటలో అక్కడికక్కడే నలుగురు తమిళనాడుకు చెందిన మహిళలు ఊపిరాడక మృతి చెందారు. మరోవైపు బైరాగి పట్టెడ ప్రాంతంలో రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇదేవిధంగా ఒక మహిళను వెలుపలికి పంపే క్రమంలో గేటు తోసుకుంటూ లోనికి వెళ్ళిన భక్తులు మధ్య తొక్కేసినట్టు జరిగి దాదాపు తొమ్మిది మంది ఊపిరాడక భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదేవిధంగా అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కొంతమంది భక్తులు తోపులాటకు గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.
తీవ్రగాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఇంకా ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు.
తిరుపతి నగరంలో బుధవారం రాత్రి ఉన్నట్టుండి గతంలో ఎన్నడూ లేనివధంగా తోపులాటలు తొక్కేసి లాటలు జరిగి దేవుడు దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య హాహాకారాలు చెలరేగడం పోలీసు అధికారుల భద్రత వైఫల్యాన్ని వారి నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసింది.
ఈ తోపులాటలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించాల్సిన అంబులెన్సులు సంఘటన స్థలంలో డ్రైవర్లు లేక ఖాళీగా ఉండటం కనిపించింది. డ్రైవర్లు ఎక్కడికెళ్లారో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇదే సందర్భంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి వ్యవహారంపై భక్తులు ఆగ్రహంతో మండిపడ్డారు.‌
భక్తుల రద్దీ పరిస్థితి, అందుకు ముందస్తుగా ఏర్పాటు చేయాల్సిన భద్రత పరిస్థితులు, సౌకర్యాల కల్పన లో అంచనా వేయడంలో టిటిడి అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.

తిరుపతి ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
నేడు క్షతగాత్రులకు పరామర్శ

గతంలో ఎన్నడు లేని విధంగా తిరుపతిలో శ్రీవారు భక్తులు తొక్కిసలాట జరిగి ఆరు మంది మృతి చెందడాన్ని పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనకు ఏర్పాట్లపై అప్పటికప్పుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.‌ భక్తుల సంఖ్యకు తగిన విధంగా ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ టిటిడి అధికారులపై మండిపడ్డారు. భద్రతా ఏర్పాట్లు కూడా తగిన స్థాయిలో చేయకపోవడంపై ఎస్పీ అధకారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడుతో కలిసి రాష్ట్ర డిజిపి, హోంమంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఉన్నతాధికారులతో అప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి తక్షణమే తిరుపతిలో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంఘటనా స్థలంలో అధికారులు..

సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సి వి ఎస్ శ్రీధర్, తదితర అధికారులు తోపులాటలో తొక్కేసినట్లు జరిగిన ప్రాంతాలైన విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం రామానాయుడు స్కూల్, సత్యనారాయణపురం సర్కిల్ తదితర ప్రాంతాలకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేలా తిరుపతి రుయా స్విమ్స్, ఆసుపత్రిల వద్దకు చేరుకొని ఏర్పాట్లు చేపట్టారు. రాత్రి 11:00 కల్లా అన్ని కౌంటర్లలో వద్ద భద్రతా పరిస్థితి అదుపులోకి వచ్చింది. యధావిధిగా శ్రీవారి భక్తులకు టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. స్వామి వారి భక్తుల రద్దీ అధికం కావడంతోనే అనుకున్న సమయం కంటే ముందుగా టోకెన్ల జారీని చేపట్టాల్సి వచ్చిందని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం…
భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు: టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు

ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని భక్తుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని… భక్తులెవరు ఆందోళన పడాల్సిన పనిలేదని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఈ సంఘటనపై భక్తులను క్షమించాలని కోరుతున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించారు. సంఘటనా స్థలంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేయడం తప్ప ప్రస్తుత పరిస్థితులకు ఏమి చేయలేకపోతున్నామని బాధాతప్త హృదయంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో భక్తులకు కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై హెచ్చరిస్తూనే వచ్చామని, ఏర్పాట్లపై కూడా శ్రీవారి ఆలయంలో ఉండగా ఎస్పీ సుబ్బరాయుడు పదేపదే జాగ్రత్త పడమని తెలియజేశానని అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురవొచ్చేమో అని తనకు ముందు నుంచే అనుమానం వచ్చిందని అందుకని అధికారులను జాగ్రత్త పడమని హెచ్చరించానని నాయుడు వ్యాఖ్యానించారు.

తిరుపతిలోని భక్తుల తోపులాట మృతుల సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన చాలా బాధ కలిగిస్తోందని అక్కడ తగిన ఏర్పాట్లు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

టోకెన్ లేని దర్శనాన్ని నిలిపివేయడం..
తిరుపతిలోనే నియంత్రించాలి అనుకోవడం తప్పిదమే
టిటిడి మాజీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దర్శనం టికెట్ల టోకెన్ల జారీలో తోపులాటలు తోకేసులాటలో జరిగి 6 మంది భక్తులు చనిపోవడం చాలా బాధాకరమని ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడిలో దీర్ఘకాలం పనిచేసిన మాజీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతి సంఘటనపై ఆయన స్పందిస్తూ, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి రెండు రోజుల్లోనే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలని ఆత్రుత పడడం సహజంగా జరుగుతుందని అయితే ఎందుకు తగిన విధంగా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో ముందస్తు రిజర్వేషన్ ద్వారా ఎన్ని టోకెన్ విధానాలు అమలు చేసినప్పటికీ నేరుగా కంపార్ట్మెంట్లలో కూర్చుని ఎటువంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతించే విధానం చాలా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ విధానాన్ని ఇప్పుడు పాటించకుండా పూర్తిగా టోకెన్ విధానం అమల్లోకి తీసుకువచ్చి టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల కు రావాలని టీటీడీ ప్రకటించడంతోనే అసలు సమస్య మొదలైందని అన్నారు. భక్తుల మధ్య గందరగోళం ఏర్పడి టోకెన్లు లేనిదే తిరుమలకు వెళ్లే అవకాశం లేదని ఆపోహపడి పూర్తిగా తిరుపతి కౌంటర్లపై ఆధారపడడంతో కౌంటర్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువై ఇలా తోపులాటలకు దారి తీసింది అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి ఇంతమంది భక్తులు మరణించడం భద్రత వైపల్యంగా భావించాల్సి ఉంటుందన్నారు.‌ టిటిడిలో అందరూ సమన్వయంగా ముందుకు వెళితేనే ఇటువంటి సంఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని కేఎస్ శ్రీనివాసరాజు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text