
ఐదు రోజుల పాటు క్రీడా పోటీలు
28 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న 53టీమ్ లు
హన్మకొండ జేఎన్ఎస్ లో లాంఛనంగా ప్రారంభం
హైదరాబాద్, జనవరి 10,2025
సెపక్ తక్రా క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీలో మరింత స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం నేషనల్ ఛాంపియన్ షిప్ 2025 లక్ష్యమని సెపక్ తక్రా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్ర స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగే సెపక్ తక్రా జాతీయ క్రీడలను వర్థన్నపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో యోగేందర్ సింగ్ దహియ, ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, సెక్రటరీ వీర్‌గౌడలతో కలిసి పెరిక సురేష్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ “తెలంగాణతో పాటు భారతదేశం అంతటా సెపక్‌తక్రావాను ప్రోత్సహించడంలో ఈ టోర్నమెంట్ ఒక మైలురాయి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్ ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్ ఈవెంట్ , క్వాడ్ ఈవెంట్ నాలుగు విభాగాలలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేకమైన ఛాంపియన్‌షిప్ నిర్వహణలో తెలంగాణ సెపక్‌తక్రా అసోసియేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సురేష్ ప్రశంసించారు. సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమనీ, ఇది మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సురేష్ అన్నారు.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హన్మకొండ లైబ్రరీ చైర్మన్ అజీజ్ఖాన్, బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షరాలు రావు పద్మ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు కీర్తిరెడ్డి, డీవైఎస్వో అశోక్కుమార్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నారాయణరెడ్డి, తెలంగాణ వైఎస్ ప్రెసిడెంట్ జగన్నాథస్వామి, నరేష్ తదితరులు హాజరైయ్యారు.


28 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న 53 టీమ్లు
హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలకు చెందిన క్రీడా కారులు పాల్లొంటున్నారు. కాగా వీరిలో 23 మహిళా జట్లు, 30 పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. టీం ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్ ఈవెంట్, క్వాడ్ ఈవెంట్ ఇలా నాలుగు విభాగాల్లో క్రీడలు ప్రారంభమైయ్యాయి.


