
విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 10, 2025: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో 2018 నుంచి భర్తీ కాకుండా పెండింగ్ లో ఉన్న దాదాపు 200 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.. శుక్రవారం తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ ఆవిష్కరణ మింట్ కాంపౌండ్ లోని విద్యుత్ ప్రభాభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎన్. అశోక్, ప్రధాన కార్యదర్శి పి. అంజయ్యల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెన్కో ఫైనాన్స్ ఇంచార్జీ డైరెక్టర్ ఈ. అనురాధ, నార్తర్న్ డిస్కాం ఫైనాన్స్ ఇంచార్జీ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, సదరన్ ఫైనాన్స్ ఇంచార్జీ డైరెక్టర్, హెన్ఆర్ కే. సుధా మాధురి హాజరయ్యారు.



ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు సిఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క ఆదేశాలతో ప్రమోషన్లు లభించాయని వారికి విద్యుత్ అకౌంట్స్ అధికారుల తరపున ధన్యవాదాలు తెలిపారు.. ఈ ప్రమోషన్లు కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిన డిస్కాం సిఎండీలు ముషారఫ్ ఫారుకి అలీ, వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాస్ రావులకు ఉద్యోగుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

2018 నుండి నేటి వరకు భర్తీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో దాదాపు 200 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని గత 6 సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్న బీకాం గ్రాడ్యుయేట్ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని విన్నవించారు. 2004 నాటికి విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జీపిఎఫ్ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర విద్యుత్ అకౌంట్స్ అధికారులు రాష్ట్ర అభివృద్ధి సూచికగా ఉన్న విద్యుత్ సంస్థల్లో పని చేయడం గౌరవంగా భావిస్తూ ప్రభుత్వ విధానాలకు అనూగుణంగా వినియోగ దారుల అవసరాల కోసం చిత్తశుద్దితో పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.




ఈకార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాసర్ షరీఫ్, జాయింట్ సెక్రటరీ వరమేష్, ఫైనాన్స్ సెక్రటరీ అనిల్, ఉమెన్ సెక్రటరీ అనురాధ తో పాటు వేణుబాబు, వెంకటేశ్వర్లు, అశోక్, స్వామి, లక్ష్మణ్, శ్యామల్ రావు, సత్యనారాయణ ప్రసాద్, సుదర్శన్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

