
సీఎం, డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన రత్నాకర్ రావు, సదానందం
హైదరాబాద్, మార్చి 20,2025
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇంధనశాఖకు పెద్దమెత్తంలో నిధులు కేటాయించినందుకు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గురువారం పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్రావు, సెక్రటరీ జనరల్ సదానందం మాట్లాడుతూ విద్యుత్ శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.21,221 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీసీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

గత ఏడాది కంటే రూ.4,815 కోట్లు అధికంగా కేటాయించడం అభినందనీయమన్నారు. ట్రాన్స్‌కో, డిస్కంలలో నెట్ వర్క్ ను వేసవికి అనుగుణంగా చర్యలు చేపట్టినందుకు ప్రశంసించారు. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా కొత్త పవర్ ప్లాంట్లు సోలార్, విండ్, రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో ద్వారానే నిర్మించారని ఈ సందర్భగా వారు కోరారు. రైతులకు, వినియోగదారులకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలు అందించి సంస్థకు మంచి పేరు తేవాలని రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఇంజినీర్లకు రత్నాకర్ రావు,సదానందంలు పిలుపు నిచ్చారు.