
వికారాబాద్ ఏప్రిల్ 05,2025: తక్కువ ధరకు చీరలు వస్తాయంటే మహిళలు ఎగబడతారని ఓ షాపింగ్ మాల్ వినూత్న డిస్కౌంట్ కు తెర లేపింది..తాజాగా వికారాబాద్ జిల్లాలో జేఎల్ఎం ఫ్యాషన్ మాల్ 9 రూపాయలకి చీరలు అంటూ ప్రచారం చేయడంతో శనివారం మహిళలు పెద్ద ఎత్తున వికారాబాద్ లోని జేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వద్దకు తరలి వచ్చి క్యూలు కట్టారు.

పెద్ద ఎత్తున మహిళలు రావడంతో ఆ రోడ్డు అంతా జామ్ కావడంతో పాటు ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసి పోయింది.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళలను క్యూలో వెళ్లేలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మహిళల వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని షాపింగ్ మాల్ ఇచ్చిన బంపర్ ఆఫర్ పెద్ద ఎత్తున ప్రచారానికి కారణ భూతమైంది.. ప్రచార ఆర్భాటంతో ప్రజలను బురిడీ కొట్టించేందుకు వ్యాపారులు ఇలాంటి కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారనేది తాజా సంఘటన స్పష్టం చేస్తుంది.

