
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఐటీ, సోషల్ మీడియా వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ నేషనల్ స్పోక్స్‌పర్సన్ ప్రేంశుక్లా, సోషల్ మీడియా సౌత్ ఇండియా ఇన్‌ఛార్జ్ గిరిరాజ్ వర్నేకర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు కార్యకర్తలకు సూచించారు.

