
దీపావళి సందర్భంగా భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి దంపతులు
హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, గద్వాల బాబి రెడ్డి దంపతులు భాగ్యనగర్‌లోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. వారితో పాటు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ రెడ్డి, క్షేత్ర రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేదమంత్రాలతో మేయర్ విజయలక్ష్మి దంపతులకు ఘన స్వాగతం పలికారు. మేయర్ దంపతులు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు మేయర్ విజయలక్ష్మి, ఆమె భర్త బాబి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, క్షేత్ర రెడ్డిలను శాలువాలతో సత్కరించారు.
దీపావళి సందర్భంగా ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
