
▪️ కాంగ్రెస్ కు 47% ఓట్లు, బీఆర్ఎస్ కు 39% ఓట్లు
▪️ డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ
▪️ ‘గేమ్ చేంజర్’ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. పొలిటికల్ మేనేజ్ మెంట్ సంస్థ ‘గేమ్ చేంజర్ – మీడియబాస్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఖాయమని ప్రకటించింది. కాంగ్రెస్ 47% ఓట్లు, BRS 39% ఓట్లు, BJP 09% ఓట్లు, ఇతరులకు 05% ఓట్లు వచ్చే అవకాశం ఉందంటూ ‘గేమ్ చేంజర్ – మీడియబాస్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. బీజేపీ కి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదని ఈ సంస్థ అంచనా వేసింది. పోటీ చేసిన 58 మంది అభ్యర్థుల్లో 56 మంది డిపాజిట్లు కోల్పోతారని ఈ ఫలితాలు తెలిపాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
