
మహబూబాబాద్ జిల్లా: ఇసుక లోడు ట్రాక్టర్‌తో ఆటో ఢీ – ఇద్దరు వ్యక్తుల మృతి పలువురికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్, నవంబర్ 14: మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి – శనగపురం సమీపంలో శుక్రవారం ఉదయం ఇసుక లోడు ట్రాక్టర్‌తో ఆటో ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఆటో పలువురు తీవ్రంగా గాయపడ్డాడు.
పర్వతగిరి నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని శనగపురం వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఇసుక లోడు ట్రాక్టర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పర్వతగిరి కి చెందిన మల్లేశం (వయస్సు 38) తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆటోలో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మల్లేశంను తీవ్రంగా గాయపడిన స్థితిలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని, అత్యధిక వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఆటోపైకి ఎక్కడంతో ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవీందర్ ఘటనాస్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోడ్డు సన్నగా ఉండటం, ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు అధికంగా ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాను అరికట్టాలని వేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
