
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్
హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ అత్యంత ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సున్నితపై దాదాపు 24,729 భారీ మెజారిటీ సాధించారు, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నికలో ఘన విజయాన్ని అందించారు.
శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. మొదటి రౌండ్‌లోనే 47 ఓట్ల స్వ4ల్ప ఆధిక్యంతో మొదలైన ఈ లీడ్, రెండో రౌండ్‌కు చేరుకున్న సరికి 2,995 ఓట్లకు చేరుకుంది. మూడో రౌండ్‌లో 2,843 ఓట్ల లీడ్, నాలుగో రౌండ్‌లో అత్యధికంగా 3,547 ఓట్ల ఆధిక్యం నమోదైంది.
రౌండ్ల వారీగా కాంగ్రెస్ లీడ్:
- 1వ రౌండ్ : 47 ఓట్లు
- 2వ రౌండ్ : 2,948ఓట్లు
- 3వ రౌండ్ : 2,999ఓట్లు
- 4వ రౌండ్ : 3,547 ఓట్లు
- 5వ రౌండ్: 3300 ఓట్లు
- 6వ రౌండ్ : 2936ఓట్లు
- 7వ రౌండ్: 4000ఓట్లు
- 8వ రౌండ్: 1875ఓట్లు
- 9వ రౌండ్: 2249 ఓట్లు
- 10వ రౌండ్: 808ఓట్లు
- పోస్టల్ రౌండ్ 18ఓట్లు
10వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 24729 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.. దీంతో ప్రత్యర్థుల ఆశలు అంతమైనట్లయింది. ఒకటవ రౌండ్ మినహా మిగతా రౌండ్లలోనూ ఈ ఆధిపత్యం కొనసాగడంతో, మొత్తం 10 రౌండ్ల లెక్కింపు పూర్తికావడంతో నవీన్ కుమార్ యాదవ్ అధికారికంగా విజేతగా ప్రకటించబడ్డారు.
కాంగ్రెస్ శ్రేణులు ఈ విజయాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి. పార్టీ నాయకులు ఈ ఫలితాన్ని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చూపిన నమ్మకంగా అభివర్ణిస్తున్నారు.
ఉపఎన్నిక – ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా (10రౌండ్ల తర్వాత)
- మొదటి రౌండ్
కాంగ్రెస్: 8,911
బిఆర్ఎస్: 8,864
లీడ్: కాంగ్రెస్ – 47ఓట్లు - రెండవ రౌండ్
కాంగ్రెస్: 8,963
బిఆర్ఎస్: 6,015
లీడ్: కాంగ్రెస్ – 2,948 ఓట్లు - మూడవ రౌండ్
కాంగ్రెస్: 11,082
బిఆర్ఎస్: 8,083
లీడ్: కాంగ్రెస్ – 2999 ఓట్లు - నాలుగవ రౌండ్
కాంగ్రెస్: 9,567
బిఆర్ఎస్: 6,020
లీడ్: కాంగ్రెస్ – 3,547 ఓట్లు - ఐదవ రౌండ్
కాంగ్రెస్: 12,283
బిఆర్ఎస్: 8,983
లీడ్: కాంగ్రెస్ – 3,300 ఓట్లు - ఆరవ రౌండ్
కాంగ్రెస్: 9553
బిఆర్ఎస్: 6615
లీడ్: కాంగ్రెస్ – 2936ఓట్లు - ఏడవ రౌండ్
కాంగ్రెస్: 9939
బిఆర్ఎస్: 5939
లీడ్: కాంగ్రెస్ – 4000 ఓట్లు - 8వ రౌండ్
కాంగ్రెస్: 9293
బిఆర్ఎస్: 7418
లీడ్: కాంగ్రెస్ – 1875ఓట్లు - 9వ రౌండ్
కాంగ్రెస్: 11793
బిఆర్ఎస్: 9544
లీడ్: కాంగ్రెస్ – 2249ఓట్లు - 10వ రౌండ్
కాంగ్రెస్: 7561
బిఆర్ఎస్: 6753
లీడ్: కాంగ్రెస్ – 808ఓట్లు - పోస్టల్ ఓట్లు కాంగ్రెస్ 43, బీఆర్ ఎస్ 25, బీజేపీ 20
మొత్తం 10 రౌండ్ల తర్వాత
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్
24,729 ఓట్ల భారీ ఆధిక్యంలో గెలుపొందారు..

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయకేతనం
సెకింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఘన విజయం సాధించి… 2009 తర్వాత ఈ స్థానంలో నమోదైన అత్యధిక మెజారిటీగా రికార్డు నెల కోల్పింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా రెండో ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నమోదైన వరుస ఓటములతో బీఆర్ఎస్, బీజేపీలు నిరాశలో మునిగాయి. పార్టీలకు కలిసిరాని సానుభూతి, ఫలించని సెంటిమెంట్… ఏ ఉప ఎన్నిక చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది.
సామాజిక వ్యూహంతో ‘సోషల్’ విక్టరీ
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో అనుసరించిన సామాజిక వ్యూహం పూర్తిగా ఫలించింది. మిగిలిన పార్టీలకు భిన్నంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించడం… ప్రచారంలోనూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగడం కీలక పాత్ర పోషించాయి. గతానికి భిన్నంగా పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏకతాటిపై ప్రచారం నిర్వహించడం విజయతీరాలకు బాటలు వేసింది.
తీన్మార్ ఇన్చార్జిల సక్సెస్
ఉప ఎన్నికల్లో ఇన్చార్జిలుగా నియమితులైన ముగ్గురు మంత్రులు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మంత్రి వివేక్ , పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో నవీన్ కుమార్ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ హవా
ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది. మొదటి రౌండ్‌లో 47 ఓట్లతో మొదలై… చివరికి 24 వేలకు పైగా మెజారిటీతో ముగిసిన ఈ విజయం… ఏ డివిజన్‌లోనూ బీఆర్ఎస్ సత్తా చూపలేకపోయిందనే వాస్తవాన్ని బయటపెట్టింది.
వాడిన కమలం… డిపాజిట్ కోల్పోయిన
బీజేపీ అభ్యర్థి వాడిన కమలంలా డిపాజిట్ కోల్పోయి నిరాశలో మునిగారు. బీఆర్ఎస్ కంటే కిందటి స్థానంలో నిలిచిన ఈ ఫలితం పార్టీలో కలవరం రేకెత్తించింది. నాలుగో స్థానంలో నోటా నిలవడం… ఇతర అభ్యర్థుల ప్రభావం దాదాపు శూన్యమని నిరూపించింది.
ఈ విజయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ జోష్ మరింత పెరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ ఊపు కొనసాగుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
