
ఘనంగా వెజ్ అలాయ్ బలాయ్
హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ
హైదరాబాద్, ఏప్రిల్ 26
తెలంగాణ సంప్రదాయాల్లో వెజ్ వంటకాలకు ప్రాధాన్యత ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నగరంలో నిర్వహించిన “వెజ్ అలాయ్ బలాయ్ కార్యక్రమం” ఘనంగా జరిగింది. తెలంగాణ సంప్రదాయ శాఖాహార వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, లంకల దీపక్ రెడ్డి, తదితర నేతలు, మహిళా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ సందర్భంగా నిర్వాహకుడు పెరిక సురేష్ మాట్లాడుతూ, తెలంగాణ సంప్రదాయ శాఖాహార వంటకాలతో పాటు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

