
ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి
తెలంగాణలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను సమీక్షించిన
బీజేపీ జాతీయ కార్యదర్శి అల్కా సింగ్ గుర్జర్
హైదరాబాద్:
100 శాతం ఓటరు ధృవీకరణే లక్ష్యమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ, తెలంగాణ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి అల్కా సింగ్ గుర్జర్ అన్నారు. మంగళవారం రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాల పురోగతిని ఆమె సమీక్షించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను సమీక్షించారు. తొమ్మిది డివిజన్లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సెమినార్లలో పాల్గొని, 18 ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌లను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా అల్కా సింగ్ గుర్జర్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులతో సమావేశమై ఓటరు నమోదు, బూత్ ధృవీకరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ఎస్‌ఐఆర్ బృందం, జిల్లా నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, వాలంటీర్లు చూపుతున్న అంకితభావాన్ని ఆమె అభినందించారు.

ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర సర్ బృందం 100 శాతం ఓటరు ధృవీకరణ, బూత్ నిర్వహణను మరింత బలోపేతం చేయడం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు. అల్కా సింగ్ గుర్జర్ మార్గదర్శకత్వంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ రాష్ట్ర కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్‌ఐఆర్ జోన్-3 ఇన్‌చార్జి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఎస్‌ఐఆర్ జోన్-3 కోఆర్డినేటర్ పెరిక సురేష్, జోన్-1 ఇన్‌చార్జి జయశ్రీ, ఎస్‌ఐఆర్ లీగల్ టీమ్ హెడ్ ఆంథోనీ రెడ్డి, జోన్-4 ఇన్‌చార్జి పంజర్ల శ్రీను, జోన్-3 ప్రతినిధి భరద్వాజ్, ఐటీ ఇన్‌చార్జి వినోద్, కార్యాలయ కోఆర్డినేటర్ కార్తీక్, సోషల్ మీడియా ప్రతినిధి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
