
తెలుగు భాషా దినోత్సవంలో విద్యార్థినికి ప్రథమ బహుమతి
హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ఎస్.టి. జోసెఫ్‌స్ స్కూల్, హబ్సిగూడకు చెందిన మూడో తరగతి విద్యార్థిని ఎ. ప్రణీక కథల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది.

మూడో తరగతి ‘సి’ విభాగానికి చెందిన ప్రణీక ప్రతిభను గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఆమెను అభినందించింది. ఈ సందర్భంగా 2026–27 విద్యా సంవత్సరానికి ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించింది. విద్యార్థిని తండ్రి ఎ. రాఘవేందర్ ప్రోత్సాహం, తాత వారసత్వంగా తెలుగు భాష పై మక్కువ పెంచుకోవడం గమనార్హం
తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు.
