
తెలంగాణ నుంచి విశిష్ట ప్రతినిధిగా ఎంపిక
అభినందించిన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రామచందర్ రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 15: జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడలు-2026లో భారత సెపక్ తక్రా బృంద ప్రతినిధిగా తెలంగాణ సెపక్ తక్రా అధ్యక్షుడు పెరిక సురేష్ ఎంపికయ్యారు. సెపక్ తక్రా క్రీడ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది.
ఆసియా క్రీడల్లో తెలంగాణ నుంచి ఎంపికైన వ్యక్తి సెపక్ తక్రా ప్రతినిధిగా ఆయన నిలిచారు. తనపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ వేదికపై సేవ చేసే అవకాశం కల్పించినందుకు పెరిక సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆసియా సెపక్ తక్రా సంఘముఖ్య అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ ఖాదర్, సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఈ సందర్భంగా పెరిక సురేష్ కు అభినందనలు తెలిపారు


