45 ఏళ్లుగా ఈ రంగంలో డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి సేవలు
ఒకే కేంద్రం.. ఏడు రాష్ట్రాలకు విస్తరణ!
ఏటా కోటి మందికి పైగా సేవలు
77వ జన్మదిన వేడుకల్లో ఘనంగా అభినందించిన ప్రముఖులు
హైదరాబాద్‌ : వైద్య నిర్ధారణ రంగంలో నాలుగున్నర దశాబ్దాలుగా డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. 1981లో హైదరాబాద్‌లో ఒకే కేంద్రంతో ప్రారంభమైన విజయ డయాగ్నోస్టిక్స్‌ నేడు ఏడు రాష్ట్రాల్లోని 30 నగరాలకు విస్తరించి, సుమారు 170 కేంద్రాల ద్వారా ఏటా కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలందించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అభినందన సభలో అతిథులు ఆయన 45 ఏళ్ల విజయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.


రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య నిర్ధారణ పరీక్షలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో 1981లో విజయ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించారని తెలిపారు. అప్పట్లో పరీక్షల కోసం రోగులు వేర్వేరు కేంద్రాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను గుర్తించి, సమగ్ర సేవలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నాణ్యత, కచ్చితత్వం, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో సంస్థ క్రమంగా విస్తరించిందన్నారు.


వ్యాధులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్సకు అవకాశం ఉంటుందన్న ఆలోచనతో డాక్టర్‌ రెడ్డి వైద్య నిర్ధారణ సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారని వక్తలు పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు, కచ్చితమైన పరీక్షా ఫలితాలు, అందుబాటు ధరలతో ప్రజల్లో విశ్వాసం సంపాదించారని కొనియాడారు.
సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందన్నారు. 400 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీలో వాటాలు కల్పించి, సంస్థ వృద్ధి ఫలాల్లో వారికీ భాగస్వామ్యం కల్పించారని గుర్తుచేశారు. తన వద్ద పనిచేసిన వైద్యులు, నిపుణులు సొంతంగా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో కొత్త వ్యాపారవేత్తల ఎదుగుదలకు తోడ్పడ్డారని తెలిపారు.


వ్యాపార విస్తరణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతకు కూడా డాక్టర్‌ రెడ్డి ప్రాధాన్యమిచ్చారని అతిథులు ప్రశంసించారు. బాలికల విద్యకు చేయూతనివ్వడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే కేంద్రంతో మొదలైన సంస్థను ఏడు రాష్ట్రాలకు విస్తరించడంలో ఆయన దూరదృష్టి, నిబద్ధత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయని అన్నారు. వైద్య నిర్ధారణ రంగంలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆకాంక్షిస్తూ 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిప్రసాద్ రెడ్డి , వివిధ రంగాల ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఫోటో..డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి 77వ జన్మదిన వేడుకల్లో ఘనంగా అభినందించిన ప్రముఖులు చిత్రంలో సాయిప్రసాద్​ రెడ్డి తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text