
కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ తో ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ భేటీ
హైదరాబాద్: రాబోయే ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా మీడియా, ఐటీ, సోషల్ మీడియా ఇంచార్జ్ పెరిక సురేష్ అశాభావం వ్యక్తం చేశారు. ధర్మంపై అధర్మం, సత్యంపై అసత్యం, మంచిపై చెడు సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దసరా శరన్నవరాత్రుల పవిత్ర సందర్భంలో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం సన్నిధిలో భవానీ దీక్షలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌ను పెరిక సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేష్ మాట్లాడూ దుర్గామాత ఆశీస్సులతో బీజేపీ విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో విజయం, ఆనందం వెల్లివిరియాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో ధైర్యం, ధర్మనిష్ఠ, సత్ప్రవర్తన, సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, సమైక్యత, సామాజిక బాధ్యతతో ప్రగతిశీల తెలంగాణ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజాసేవలో నాయకులు మరింత అంకితభావంతో ముందుకు సాగాలని, తెలంగాణ ప్రజలకు, దేశానికి సేవలందించే క్రమంలో వారికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ భేటీలో బీజేపీ జాతీయ సభ్యుడు (మీడియా, ఐటీ, సోషల్ మీడియా – ఓబీసీ) బీజేపీ పెరిక సురేశ్‌తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పలువురు రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

.ఫోటో…కేంద్ర హోంమత్రి బండి సంజయ్‌తో భేటీ అయిన ఓబీసీమోర్చా జాతీయ సభ్యుడు పెరిక సురేష్, చిత్రంలో రాష్ట్ర అధ్యక్షుడు అనంద్ గౌడ్
