
పురస్కారాన్ని దేశ, రాష్ట్ర ప్రజలకు అంకితం
అభినందించిన కేంద్ర మంత్రులు
హైదరాబాద్ : జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన 20వ ఆసియా క్రీడలు–2026లో అందించిన సేవలకు గాను అంతర్జాతీయ టెక్నికల్ గోల్డ్ మెడల్ అందుకోవడం గర్వంగా ఉందని అవార్డు గ్రహీత పెరిక సురేష్ పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును భారతదేశానికి, తన ప్రియమైన తెలంగాణకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. భారత క్రీడారంగానికి మరింత అంకితభావంతో సేవలందించేందుకు ఈ పురస్కారం స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గణులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల ప్రోత్సాహం, అభినందనలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. దేశ క్రీడారంగానికి సేవలందించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

