
52 బంతుల్లో డబుల్ సెంచరీ
క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేశాడు ఈ కుర్రాడు..! బౌలర్లు బంతి వేయాలంటేనే భయపడేలా చేశాడు..! కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. 28 సిక్సర్లు.. 7 ఫోర్లు..! ఇది విధ్వంసం కాదు.. విధ్వంసానికి మరో పేరు..! క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పరుగుల సునామీ ఇది!
రికార్డులన్నీ బద్దలయ్యాయి..! ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
మొదట 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ..! ఆ తర్వాత కేవలం 28 బంతుల్లోనే సెంచరీ..! అక్కడితో ఆగలేదు. 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి.. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. 28 సిక్సర్లు, 7 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఏకంగా 385 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్.. ఏబీ డివిలియర్స్ 360 స్ట్రైక్ రేట్ రికార్డును అధిగమించాడు. అంతేకాదు.. తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డులను తిరగరాశాడు. గతంలో హ్యారీ బ్రూక్ 114 బంతుల్లో, శుభ్‌మన్ గిల్ 117 బంతుల్లో సాధించిన డబుల్ సెంచరీల రికార్డులను వెనక్కి నెట్టేశాడు.
ఒక ఇన్నింగ్స్‌లోనే 28 సిక్సర్లు బాదిన వైభవ్ విధ్వంసం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. కేవలం పరుగులు చేయడమే కాదు.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ఈ యువ సంచలనం.
వయసు చిన్నదే.. కానీ విధ్వంసం మాత్రం ప్రపంచ స్థాయి..! వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి!
