గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్​ ఘాటుగా విమర్శించారు. రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో మోడీ సర్కారు ఏదో చేయాలనుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో కలిసి తెలంగాణ ‘ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్ హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు గ్రూప్​​–1 అధికారులు లెఫ్ట్​నెంట్​గవర్నర్​ పరిధిలోకాకుండా ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో పని చేయాలని ఆదేశించింది. సుప్రీంను కాదని కేంద్రం ఆర్డినెన్స్​ తెచ్చిందని విమర్శించారు. ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీపార్టీ గెలిస్తేమేయర్​ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమాన పరిస్తోందని ఆరోపించారు.

దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శించా రు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ అధికారంలో లేని ప్రభుత్వాలను పనిచేయనివ్వడంలేదని మండిపడ్డారు. 

ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా బీజేపీ వెళుతోందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పాటించకుంటే ఎలా? అని కేసీఆర్ నిలదీశా రు. కేంద్రం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని, ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఆయన హితవు పలికారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం అని పేర్కొన్నారు. వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టినెన్స్​ను ఓడించేందుకు కేజ్రీవాల్​కు తమ మద్దతు ఉంటుందనిప్రకటించారు.

“దేశంలో కేంద్రప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు ఎక్కువైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయనియ్యడం లేదు ఆర్థికపరమైన ఇబ్బందులను కేంద్రం విపక్ష పార్టీలు ఉన్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోంది”..అనీ కేసీఆర్ విమర్శించారు..

కర్ణాటకలో మోడీ వంగి వంగి కోతి దండాలు పెట్టినా ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని, అయినా బీజేపీకి బుద్ధిరాలేదని పేర్కొన్నారు. ఇదే వరుసలో త్వరలోనే దేశం మొత్తం కూడా బీజేపీకి గుణపాఠం చెబుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text