
సినీనటి సమంత ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ సినిమాలో నటించబోతోంది. ‘చెన్నై స్టోరీ’ అనే పేరుతో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ వర్షన్ లోనూ సమంత నటిస్తోంది. మొన్నటి వరకు సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంతకు ఇప్పుడు నార్త్ లోనూ ఫాన్ ఫాలోయింగ్ క్రేజ్ గణనీయంగా పెరిగింది. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా తెరకెక్కుతోంది.
