
#క్వచ్చర్ పేపర్ లో ప్రశ్నలకు చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్
డీఈ రమేశ్ ను అరెస్ట్ చేసినతో బయట పడిన వ్యవహారం
వెలుగు చూసిన టెక్నాలజీ వినియోగం
రమేశ్ కు క్వచ్చన్ పేపర్స్ వాట్సాప్ చేసిన ప్రిన్సిపాల్
చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్
ఎగ్జామ్ రాసే వారికి బ్లూటూత్ ద్వారా పంపిన రమేశ్
ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 లక్షలు వసూళ్లు
హైదరాబాద్, మే 30
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో ఆసక్తికర వ్యవహారం వెలుగు చూసింది. నిందితుల్లో ఒకరు టీఎస్ పీఎస్సీ క్వచ్చన్ పేపర్‌లోని ప్రశ్నలకు ఆన్సర్ కోసం చాట్ జీపీటీని వినియోగించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది.

పెద్దపల్లిలోని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ (నార్త్ డిస్కం)లో డీఈగా పనిచేస్తున్న పూల రమేశ్ (35) టీఎస్ పీఎస్సీ నిర్వహిస్తున్న ఏఈఈ, డీఏఓ ప్రశ్నాపత్రాలను చేజిక్కించుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చాట్ జీపీటీ సాయంతో ఆ క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలకు ఆన్సర్స్ సేకరించాడు. పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లిన అభ్యర్థులకు ఆన్సర్స్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ద్వారా పంపించినట్లు ధర్యాప్తులో తేలింది.
ఓ పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్న ప్రిన్సిపల్ ఈ వ్యవహారానికి సహకరించినట్లు బయటపడింది. ప్రిన్సిపల్ రెండు ప్రశ్నాపత్రాలను ఫోటోలు తీసి రమేశ్ కు వాట్సాప్ ద్వారా పంపినట్టు సిట్ ధర్యాప్తులో గుర్తించారు. తన నలుగురు సహాయకులతో సిద్ధంగా ఉన్న రమేశ్ చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్ సిద్ధం చేసి, వాటిని పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు పంపించినట్లు తేలింది. టీఎస్ పీఎస్సీ పరీక్షల్లో పాస్ అయ్యేట్టు చేస్తే ఒక్కొక్కరు రూ.40 లక్షలు ఇచ్చేటట్టు రమేశ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తాజాగా బయటపడింది.