మార్కెట్ యార్డులో కొలువు దీరిన, సీఎం, హరీష్ చిత్రాలు
మార్కెట్ యార్డు అంతటా అభిమానమే

- రైతు బిడ్డలు… నవ శకానికి నాంది పలికన నాయకులకు
నవ ధాన్యాలతో ఆత్మీయ అభిమానం - రైతు దినోత్సవం…
హరీశ్ రావుకు జన్మదినోత్సం..
సిద్ధిపేట, జూన్ 3
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి దినోత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కాగా శనివారం – సిద్దిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతు దినోత్సవం సందర్భంగా.. రైతు పండించిన ధాన్యం తో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చిత్ర పటాలతో రూపొందించి రైతు దినోత్సవం ప్రత్యేకంగా నిర్వహించారు.- అంతేకాకుండా ఇదే రోజున రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు జన్మదినోత్సం కావడంతో మార్కెట్ యార్డులో వేడుకలు నిర్వహించారు. ఈ భారీ చిత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకత నిలవడం కొసమెరుపు.