సింగపూర్ లో రోబో పోలీస్ సేవలు
సొంతంగా నిర్ణయాలు తీసుకునే రోబోలు
చాంగీ ఎయిర్ పోర్టులో విధులు
గత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్

సింగపూర్, జూన్ 20
రోబోలు ఇప్పుడు పోలీసు విధుల్లో వస్తున్నాయి. ఎవరో కమాండ్ ఇస్తే కానీ పనిచేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే రోబో కాప్‌లు విధుల్లో చేరుతున్నాయి. ఇదే రీతిలో సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ డీసీషన్ తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ రోబోలను ప్రవేశపెట్టింది. న్యూయార్క్ పెట్రోలింగ్ విధుల్లో ఈ రోబోలు పాలుపంచుకుంటున్నాయి.

గత ఐదేళ్లుగా ట్రయల్స్..
సింగపూర్ లో పోలీస్ రోబోలతో గత ఐదేళ్లుగా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా సింగపూర్‌లో డ్యూటీకీ సిద్దమైన రోబోలకు కెమెరాలు, సెన్సర్లు, సైరన్లు అమర్చారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 ఫీట్లు కాగా దీని కెమెరాతో 360 డిగ్రీల్లో చూడొచ్చు. దీనికి అమర్చిన స్పీకర్లు అమర్చి ఉంటాయి. ప్రజలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో ఈ రోబోలకు ఉన్న స్పీకర్లు, మైక్రోఫోన్లతో ప్రజలను ఎలర్ట్ చేస్తూ మాట్లాడుతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులో అయినా ఎప్పటి కప్పుడు ప్రజలకు, పై అధికారులను ఎలర్ట్ చేస్తుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి పాల్గొనే ఆపరేషన్లలో ఈ రోబోలు కీలకపాత్ర పోషించనున్నాయి. కాగా, ఈ రోబో పోలీస్ సేవలను సింగపూర్ లో చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఫస్ట్ డ్యూటీ చేయడానికి సిద్ధమైంది.

ఇక శాసించే స్థాయిలో లేటెస్ట్ రోబోలు..
హ్యూమన్ రిసోర్స్‌కు ఆల్టర్నేట్‌గా రోబోలునిలుస్తున్నాయి. మెడికల్ రంగంలోకి కీలకమైన హార్ట్ సర్జరీలు సైతం రోబోలు నిర్వహిస్తున్నాయి. నిర్మాణ రంగం, హోటల్, హాస్పిటాలిటీ, ఆటోమెబైల్ రంగంలో రోబోలు విధులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రోబో టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. భవిష్యత్తులో వరల్డ్ ను శాసించే దిశలో రోబో టెక్నాలజీ అందుబాటులో రానుందనేది నిర్వివాదాంశం.
