
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తాం
లబ్ధిదారులకు జులై 15న చెక్కుల పంపిణీ
వెల్లడించిన మంత్రి గంగుల
హైదరాబాద్, జూన్ 20
బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మంగళవారం రోజు వరకు వచ్చిన అప్లికేషన్‌లను పరిశీలిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు జులై 15న చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి అన్నారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించి ప్రస్తుతానికి గడువు ముగిసినప్పటికీ, తిరిగి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. రెండో విడత దరఖాస్తుల కోసం మరో గడువు తేదీ ఉంటుందన్నారు.