ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్
పోటీపడుతున్న బ్రాండింగ్ సంస్థలు
హైదరాబాద్, వెలుగు
‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ సంస్థ జూనియర్ ఎన్టీఆర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పబ్బిసిటీ చిత్రాలలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంటుంది. దీనికి గాను కోట్ల రూపాయల డీల్ ను ఈ సంస్థతో ఎన్టీఆర్ కుదుర్చుకున్నట్టుగా తాజా సమాచారం.

ఇటు నార్త్ లోను .. సౌత్ లోను మంచి క్రేజ్ .. మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరో కావడంతో ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను ఎంచుకోవడం గమనార్హం.

ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ స్థాయికి వెళ్లడంతో ఆ సినిమాతో కీ రోల్ పోషించిన ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి పలు కంపెనీలు పోటీపడుతున్న విషయం తెలిసందే.
